SAKSHITHA NEWS

SP Rahul Dev Sharma IPS is the response program

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయములో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి  ఫిర్యాదిదారులు వచ్చి జిల్లా  ఎస్పీ  కి పిర్యాదు లను ఎక్కవగా  వర కట్నం వేదింపులు, సరిహద్దుల విషయములో గొడవలు, సివిల్ వివాదలపై  పిర్యాదులు  ఇచ్చినట్లు,

@కైకలూరు మండలం సీతనపల్లి గ్రామంలో ఒక వ్యక్తి స్పందన కార్యక్రమంలో ఎస్పీ నీ కలిసి ప్రజలందరూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలములో అమ్మవారి గుడి నిర్మాణం చేసుకొని సదర్ గ్రామపంచాయతీ వారి యొక్క అనుమతితో చందాల రూపంగా తీసుకున్న డబ్బులతో వంతెన నిర్మాణం చేసుకొనుట కొరకు మరియు సదరు గుడిలో పూజా కార్యక్రమాలకు చేసుకొనే క్రమంలో కొంతమంది వ్యక్తులు అవరోధాలు కల్పిస్తూ, దౌర్జన్యం చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినారు.

@ఏలూరు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి మనకు 2003 వ సంవత్సరంలో వివాహం జరిగినట్లు వివాహ సమయంలో ఘటన కానుకలతో కాపరానికి పంపించిన కొంతకాలం కాపురం సజీవుగా సాగిన భర్త చెడు వ్యసనాలకు లోనై అధిక కట్నం కొరకు ఇంటి నుంచి గెంటివేసిన విషయంపై చర్యలు తీసుకోవలసినదిగా కోరినది.

@ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ని స్పందన కార్యక్రమంలో కలిసి వారి గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెరువులను కొంతమంది రాజకీయ ప్రాముఖ్యం కలిగినటువంటి వ్యక్తులు లీజు విషయంలో ఫిర్యాదు పై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాల్సినదిగా కోరినాడు

@జంగారెడ్డిగూడెం నుంచి ఒక వ్యక్తి ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన కుటుంబం ఆర్మీలో ఉద్యోగ నిర్వహణ చేసి రిటైర్ అయినట్లు నాకు ఒక వ్యక్తి పరిచయం చేసుకొని ఆర్మీ వారికి సంబంధించిన స్థలాలు రాజవరం గ్రామము కోయిలగూడెం మండలంలో ఐదు ఎకరాలు భూమి ఫిర్యాదుకు చెందినట్లు దాని నిమిత్తం ఎం.అర్. ఓ కోయ్యల గూడెం ఆఫీస్ లో ఎఫ్ఎంబి లో కల్పించుట కొరకు 18 లక్షలు తీసుకొని మోసం చేసిన విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినాడు.

@చాటపర్రు గ్రామం నుండి ఒక వ్యక్తి ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తనకు ఫోటో స్టూడియో ని లీజికి ఇచ్చినటువంటి వ్యక్తులు ఫోటో స్టూడియో యొక్క బోర్డును తీసివేసి ఆర్థికంగా నష్టం చేసిన విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినాడు

స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై సత్వరమే చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాటలాడి ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ .

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తక్కువ వడ్డీకి తక్కువ సమయంలో ఇస్తామని చెప్పి మోసగించే సైబర్ నేరగాల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని ఫేక్ లోన్ యాప్ దారులు 2000 అప్పుగా ఇస్తే, రెండు లక్షల రూపాయలను వసూలు చేస్తారని గ్రహించాలని,

ఏ విధమైన తనఖాలు లేకుండా ఒక్క ఫోన్ నెంబరు ఆధారంగా ఇచ్చే ఫేక్ లోన్ యాప్ ల పట్ల ప్రజలు జాగ్రత్తలను తీసుకోవాలని, అలా కాకుండా మీరు ఫేక్ లోన్ యాప్ ద్వారా ఆప్పు తీసుకున్న ఎడల, మీ యొక్క ఫోన్ లో ఉన్న సమాచారాన్ని తస్కరించి మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి మీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారని గ్రహించాలని ఈ పత్రికా ప్రకటన ద్వారా జిల్లా ఎస్పీ తెలియ చేసినారు


SAKSHITHA NEWS