పేపర్ బాయ్ లా మారిపోయిన సోమిరెడ్డి

Spread the love

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మందల వెంకట శేషయ్య యాదవ్, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, తోటపల్లి గూడూరు వైకాపా మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, వెంకటాచలం వైకాపా మండల కన్వీనర్ మోహన్ నాయుడు, సర్వేపల్లి AMC డైరెక్టర్ చీకుర్తి నరసయ్య, వైకాపా నాయకులు భాస్కర్ నాయుడు, కప్పిర సురేష్ యాదవ్, తదితరులు.

మందల వెంకట శేషయ్య యాదవ్ మాట్లాడుతూ…
సోమిరెడ్డి పేపర్లో వచ్చిన ప్రతి వార్తని చూపించి, మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయాడు.
సోమిరెడ్డి పేపర్లో వచ్చే వార్తల గురించే మాట్లాడాలనుకుంటే..!
గతంలో సోమిరెడ్డి మహిళా వైద్యురాలి పట్ల ప్రవర్తించిన తీరు గురించి, అది పేపర్లో వచ్చిన అంశం గురించి వివరించగలడా..!


సోమిరెడ్డి చేసిన అవినీతి వాటిని పత్రికలు ఆధారాలతో సహా రాశాయి. వాటి గురించి సోమిరెడ్డి వివరించగలడా..
సోమిరెడ్డి మహిళల పట్ల ప్రవర్తించిన తీరుకు మహిళలు సోమిరెడ్డికి దేహశుద్ధి చేయడాన్ని వివరించగలడా..!
సోమిరెడ్డి అల్లీపురంలో దగ్గరుండి నకిలీ ఎరువులు అమ్మినటువంటి సంగతి.
సోమిరెడ్డి పనికి ఆహారం కింద వచ్చిన బియ్యాన్ని అమ్ముకున్న పరిస్థితి.
యువతకు అందించాల్సిన క్రికెట్ కిట్లను కూడా అమ్ముకున్న సోమిరెడ్డి అంటూ పత్రికల్లో పుంకాలు పుంకాలుగా వచ్చిన సోమిరెడ్డి బాగోతం.


సోమిరెడ్డి పేపర్లో వచ్చే ప్రతి దానిని వాస్తవంగా భావిస్తే, తనపై రాసిన వాటిని కూడా ప్రజలకు వివరించాలి.
సోమిరెడ్డి పేపర్ చూపించి, అందరిపై బురద చల్లాలని చూస్తున్నాడు.
యువగళం పాదయాత్ర సోమిరెడ్డికి ఒక వరంలా తయారైందని మేము ముందే చెప్పాం.
యువగళం పేరిట సోమిరెడ్డికి కాసుల వర్షం కురుపిస్తుంది.
సోమిరెడ్డి మిల్లర్ల దగ్గరికి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్దకు వెళ్లి తాను అనుకున్న స్థాయిలో ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు..


ఇవ్వని పక్షంలో బహిరంగ సభలో మీ గురించి లోకేష్ చేత మాట్లాడిస్తానని వ్యాపారులను బెదిరిస్తున్నాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులను మీ లేఅవుట్ల దగ్గరికి లోకేష్ ని తీసుకొని వచ్చి, అక్రమ లేఅవుట్లు అని చెప్పిస్తానని బెదిరిస్తూ, విచ్చలవిడిగా డబ్బులు డిమాండ్ చేస్తూ, దోపిడీ చేస్తున్నాడు.
సోమిరెడ్డి, యువగళం పేరిట ఇప్పటికే కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడి, దోపిడీ చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
సోమిరెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం వెన్నతో పెట్టిన విద్య.
సోమిరెడ్డి జిల్లాలోని మంత్రిపై, శాసనసభ్యులపై లోకేష్ ఏం మాట్లాడాలో ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు.
సోమిరెడ్డి తాను తయారు చేసిన స్క్రిప్ట్ ద్వారా ఏదో ఒక అభూత కల్పన సృష్టించడానికి గతంలో అనేక సార్లు ప్రయత్నించి, నవ్వుల పాలయ్యాడు.
సోమిరెడ్డికి రాజకీయంగా పుట్టగతులు లేవు.
సోమిరెడ్డి లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని, యువగళం పాదయాత్ర చెయ్యాలనుకోవడం లోకేష్ దౌర్భాగ్యం.

Related Posts

You cannot copy content of this page