Solving problems is our agenda
సమస్యల పరిష్కారమే మా అజెండా
42వ డివిజన్ లో పర్యటించిన మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ
సాక్షిత : నగరంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించడమే మా ధ్యేయమని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు.
42 వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి అభ్యర్థన మేరకు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి రామచంద్ర నగర్, ద్వారకా నగర్ ఏరియా లలో గీతాంజలి స్కూల్ వద్ద, రోడ్డు, అండర్ డ్రైనేజీ లైన్ దెబ్బతిన్నా పరిశీలించారు.
మేయర్, కమీషనర్ సంయుక్తంగా పరిశీలించిన తర్వాత ఇంజనీరింగ్ అధికారులను అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలని ఆదేశించారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు, స్కూల్స్, హోటల్స్ ఉన్నాయని, వర్షాలు వచ్చినాక చాలా ఇబ్బంది కలుగుతుందని అందువల్ల సి.సి డ్రైన్, భూగర్భ అండర్ డ్రైనేజ్ లైన్, రోడ్డు కల్పించాలని మేయర్, కమిషనర్ వార్డు కార్పొరేటర్ ఇబ్బందులు తెలియజేశారు.
త్వరలో టెండర్లు పిలిచి పని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ తెలియజేశారు.
తిరుమల బైపాస్ రోడ్డు నుండి రామచంద్ర నగర్ పైన కేటీ రోడ్డు వరకు ఉన్న ప్రభుత్వ స్థలంలో 25 అడుగుల రోడ్డు కు ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక సమర్పించవలసిందిగా మేయర్, కమిషనర్ ఆదేశించారు.. 42 వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి, యస్.ఈ. మోహన్,యం.ఈ. వెంకటరామిరెడ్డి, ఆరోగ్యాధికారి హరికృష్ణ డి.ఈ. విజయ్ కుమార్ రెడ్డి, సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.