మాకు రోడ్డు సమస్యను పరిష్కరించండి
యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని ఎస్టీ కాలనీలోని నివసిస్తున్న దాదాపు 300 కుటుంబాలకి సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇటీవల ఆ కాలనీలో మిద్దె మీద నుంచి ఒక చిన్న బాబు పడితే ఆంబులెన్స్ కూడా రావడానికి మార్గంలేక ఆ బాబుని ఎత్తుకొని రోడ్డు పై దాకా కాలనీవాసులు తీసుకువెళ్లి అక్కడి నుండి హాస్పిటల్ కి తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక కేంద్రం బండి రావడానికి కూడా సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ కాలనీలో బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నారు.
వారి సమస్యని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి పలుమార్లు వినుముంచుకున్నారు. ఆయన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఈ సమస్యను పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు శనివారం నాడు ఆ కాలనీవాసులు మంత్రి సురేష్ ని కలిసేందుకు ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు మా సమస్యను పరిష్కరించాలని కోరారు. మంత్రి సురేష్ మీ కాలనీకి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.