SAKSHITHA NEWS

సీతానగరం పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన ఎస్సై డి రామ్ కుమార్
సీతానగరం, సాక్షిత:
పోలీస్ స్టేషన్ ఎస్సైగా డి రామ్ కుమార్ బాధ్యతలు ఈరోజు స్వీకరించారు. గతంలో విజయవాడ సిటీ లో ఎస్సై గా విధులు నిర్వహించారు. తదుపరి పత్రికా సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ సీతానగరం లో అక్రమ ఇసుక రవాణా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని,
నాటు సారా, అమ్మినా తయారు చేసిన బెల్ట్ షాపులు నిర్వహణ చేసిన అమ్మేవారు, రవాణా చేసేవారు, త్రాగేవారు పట్ల ఉక్కుపాదం మోపుతామని, పిడి యాక్ట్ లు, తెరుస్తామని హెచ్చరించారు. బ్లేడ్ బ్యాచ్ లు, రౌడీ షీటర్స్, ఇతర సంఘ వ్యతిరేఖ శక్తుల పట్ల కఠినంగా వ్యవహారిస్తామని, ముఖ్యంగా మహిళల పట్ల ఈవ్ టీజింగ్ చేసేవారినీ, దాడులకు పాల్పడే వారినీ ఉపేక్షించేది లేదనీ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని, ప్రజల శాంతిభద్రతకు భంగం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరి సహాయ సహకారలు కూడా పోలీసు వారికి ఉండాలని కోరినారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS