హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్..
తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్.
రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్.
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
Andhra Pradesh Post Election Violence | అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు, అనంతరం చెలరేగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ (SIT Chief Vineet Brijlal) అందజేశారు. ఎన్నికల సమయంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై విచారణ చేపట్టాలని వినీత్ బ్రిజ్‌లాల్ ఆధ్వర్యంలో 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే.
అల్లర్లు, హింస చెలరేగిన పల్నాడు, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, మరికొన్ని ప్రాంతాల్లో సిట్ బృందాలు రెండు రోజులపాటు పర్యటించాయి. స్థానికులు, నేతలతో పాటు పోలీసులను విచారించి పలు వివరాలు సేకరించి ప్రాథమిక నివేదిక రూపొందించారు. సోమవారం నాడు ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేశారు.