GHMC ప్రధాన కార్యాలయంలో GHMC చీఫ్ సిటీ ప్లానర్ శ్రీ రాజేంద్రప్రసాద్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పెరుగుతున్న జనవాసాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్య పరిష్కారాని కై తీసుకోవాల్సిన చర్యల పై నియోజకవర్గంలో ప్రజావసరాలకు అవసరము ఉన్న చోట చేపట్టబోయే ప్రత్యామ్నాయ రోడ్లను, లింక్ రోడ్లను వెంటనే చేపట్టాలని ,రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. రోడ్ల ఏర్పాటు పై తీసుకోవాల్సిన చర్యల పై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది , శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి మరియు స్థితిగతుల పై చర్చించడం జరిగినది.
సీసీపీ గారి తో చర్చించిన అంశాలు :
1.చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ రోడ్ విస్తరణ పనులు.
2.మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుడి వయా యశోద హాస్పిటల్ వరకు రోడ్ విస్తరణ
3.చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం హనుమాన్ గుడి నుండి అపర్ణ వరకు లింక్ రోడ్డు
4.JNTU నుండి ప్రగతి నగర్ వరకు వయ HMT హిల్స్ రోడ్డు నిర్మాణ పనులు
5.ఆస్బెస్టాస్ కాలనీ రివైజ్డ్ లే ఔట్
- హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ లోని మోర్ సూపర్ మార్కెట్ రోడ్
- నాగార్జున హోమ్స్ నిజాంపేట్ రోడ్డు TDR
దీనికి సానుకూలంగా స్పందించిన చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ సానుకూలంగా స్పందించడం జరిగినది.