గోదాగోకులంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Spread the love

ధర్మరక్షణే భగవంతుడి అవతార లక్ష్యం
కె.డి.సి.సి.చైర్ పర్సన్ ఎస్.వి.విజయమనోహరి.

భగవంతుని అవతార లక్ష్యం ధర్మరక్షణేనని కె.డి.సి.సి.ఛైర్ పర్సన్ ఎస్.వి. విజయ మనోహరి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీ గోదాగోకులం సంయుక్త నిర్వహణలో కర్నూలు నగరంలోని శ్రీ గోదాగోకులంలోని శ్రీ గోదా రంగనాథ స్వామి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించిన భక్తిమార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం శ్రీకృష్ణునికి నవ కళశ స్నపన తిరుమంజనం, విశేషాలంకరణ, అర్చన, భజనలు, గోపూజ, ఉట్లోత్సవం, పల్లకి సేవ, ఊంజలసేవ, ప్రసాదవితరణ మొదలగు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని

అనంత సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

భగవద్గీత సమయ‌‌‌ సూచిక యంత్రాల వితరణ

అనంత సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ అనంత స్రవంతి అనిల్ దంపతులు రాయలసీమ జిల్లాల లోని ఎంపిక చేసిన 68 దేవాలయాలకు
భగవద్గీత సమయ‌‌‌ సూచిక యంత్రాలు కె.డి.సి.సి.ఛైర్ పర్సన్ ఎస్.వి. విజయమనోహరి, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు చేతుల మీదుగా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ధర్మప్రచార మండలి సభ్యులు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, బి.శ్రీరాములు, కె.వి. సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత కె.వి సుబ్బారెడ్డి, రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ ప్రచారకులు సురేంద్రజీ, ఆవొపా చీఫ్ కన్వీనర్ మలిపెద్ది నాగేశ్వరరావు, యం. రామభూపాల్ రెడ్డి, విశ్రాంత ఔషధ నియంత్రణాధికారి డాక్టర్ తల్లం నాగ నారాయణ రావు, మారం లలిత, సునీత, శైలజ, జ్యోతి, చంద్రకళ, పాలాది సుబ్రహ్మణ్యం, బాలసుధాకర్, జనార్ధన్, లింగం కృష్ణయ్య, కంభం వెంకట కృష్ణయ్య, చిత్రాల వీరయ్య, చిగిలి రమేష్, అర్చకులు రమేషాచార్యులు, శేషాచార్యులు, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న కోడుమూరు శాసన సభ్యులు

గోదాగోకులంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో కోడుమూరు శాసన సభ్యులు డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని గోదాగోకులాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నిర్మాణము, ఇక్కడ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలను ఆయన కొనియాడారు.

Related Posts

You cannot copy content of this page