మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
- టిడిపి సాయి సమావేశంలో శిష్ట్లా లోహిత్, వెనుక వరుసలో నారా లోకేష్
- వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం
- పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసిన చంద్రబాబు
- కార్యకర్తలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం
- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
మంగళగిరి : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు, నారా లోకేష్, ఇతర ముఖ్యనేతల సమక్షంలో శిష్ట్లా లోహిత్ మాట్లాడారు. 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొందని తెలిపారు. గత మూడున్నరేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలను సృష్టించిందన్నారు. వాటన్నింటినీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సమర్ధవంతంగా ఎదుర్కోవడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేశారన్నారు. అందువల్లే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లతో విజయం సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన కుప్పం పర్యటనలో వైసీపీ గూండాలు అరాచకాలకు పాల్పడినా చంద్రబాబు మాత్రం ప్రజలకు అండగా నిలిచారన్నారు. నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి చంద్రబాబు, నారా లోకేష్ లు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. సంక్షేమ నిధి కోఆర్డినేటర్ గా ఉన్న తాను రాష్ట్రంలోని కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చంద్రబాబు, నారా లోకేష్ పర్యటనల్లోనూ కార్యకర్తల సంక్షేమంపై అవగాహన కల్పిస్తున్నానని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కార్యకర్తలంటే తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలని తెలిపారు. కార్యకర్తలు కష్టాల్లో ఉన్నపుడు వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు, నారా లోకేష్ లు పనిచేస్తున్నారని, వారి ఆశయాలను సాధించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్టు శిష్ట్లా లోహిత్ చెప్పారు.