SAKSHITHA NEWS

షహీద్ భగత్ సింగ్, స్వర్గీయ పెంచల్ రెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు భగత్ సింగ్…
పెంచల్ రెడ్డి ఆశయ సాధనకు అందరం కృషి చేద్దాం…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘షహీద్ భగత్ సింగ్ మరియు భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపకులు వై.పెంచల్ రెడ్డి ‘ కాంస్య విగ్రహాలను మంత్రి మల్లారెడ్డి , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొని మాట్లాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు షహీద్ భగత్ సింగ్ అని కొనియాడారు. బస్తీని స్థాపించిన పెంచల్ రెడ్డి గారి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలన్నారు. స్వర్గీయ పెంచల్ రెడ్డి ఆశించిన విధంగా భగత్ సింగ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. భగత్ సింగ్ నగర్ లో కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో పేదలందరికీ పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు, బస్తీ కమిటీ సభ్యులు, షహీద్ భగత్ సింగ్ మరియు స్వర్గీయ వై.పెంచల్ రెడ్డి విగ్రహాల పునః నిర్మాణ సన్నాహక కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS