జూలూరుపాడు లో ఆర్కే ఫంక్షన్ హాల్ లో కోరమండల్ కంపెనీ మరియు పెటిలైజర్స్ డీలర్స్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించే కిసాన్ సమృద్ధి యోజన లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులకు స్క్రీన్ ఏర్పాటు చేసి చూపించినారు ,ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల కోసం ఎరువులకు భారీ ఎత్తున సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకుంటున్నారు, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజనను మోడీ ప్రారంభించారు, దీనివల్ల రాష్ట్రంలో ఎరువులు రిటైల్ దుకాణాలు ఇక ప్రధాని కిసాన్ సేవా కేంద్రాలుగా పనిచేస్తాయి, ఇక్కడ నాణ్యమైన విత్తనాలు ,ఎరువులు అన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతాయి, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన కింద ఈరోజు 2000 రూపాయలు రైతుల బ్యాంకుల అకౌంట్ లో నేరుగా వేసినారు, సల్ఫర్ తో కలిపి తయారుచేసిన యూరియాను గోల్డ్ యూరియా పేరుతో మోడీ ప్రారంభించారు,
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా రైతులను కేసీఆర్ మోసం చేసినాడు, రైతులు పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా కెసిఆర్ అడ్డుకోవటం వల్ల ఈ రోజున రైతులకు పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం రాకుండా పోతున్నది, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేసినవాడు, ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర పైసలులేవు, రాబోయే కాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం,
తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కోనేరు సత్యన్నారాయణ (చిన్ని) అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేరు నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీషు, గిరిజన మోర్చా జిల్లా నాయకులు భూక్య శ్రీను, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భూక్య రాజేష్, కోరమండల్ అగ్రామిస్త్ర కే వాసు గంగాధర్, ఎండిటి భద్రం, డీలర్స్ ఆళ్ల మధుబాబు, మంగమమూడి నాగేశ్వరరావు, ఎడ్లపల్లి సీతారాములు, సురేష్, ప్రసాద్ మరియు రైతులు పాల్గొన్నారు.