SAKSHITHA NEWS

ఎన్నికల వేళ క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. క్రోసూరు మండలం దొడ్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత షేక్ ఖాశం సైదాతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. దొడ్లేరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమం ఎంతో బాగుందని.. జగనన్న పాలనపై నమ్మకంతోనే వైసీపీలో చేరుతున్నట్టు వారు తెలిపారు.

ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్ కి, తనకు వచ్చే ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో షేక్ తంగెళ్ల, షేక్ ఖాజావలి, షేక్ జబీరా, షేక్ మస్తాన్ వలి, షేక్ గోపి, షేక్ ఖాశింసైదా, షేక్ పెదబాషా, షేక్ రహీముద్దీన్, షేక్ నాగులు, షేక్ మస్తాన్ వలి, షేక్ సుభాని, షేక్ రౌఫ్, షేక్ షబ్బీర్, షేక్ మీరాహుస్సేన్, షేక్ నాగుల్ మీరా, షేక్ మహబూబ్ తదితరులున్నారు.


SAKSHITHA NEWS