
భారతదేశ స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ సుభాష్ చంద్రబోస్ నగర్ లో గల నేతాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు మనందరికీ ఆదర్శమని అన్నారు. స్వాతంత్ర పోరాటం అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన మహావీరుడు.. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని గుర్తుచేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, బోయాకిషన్, పోశెట్టి గౌడ్, అగ్రవాసు, ముజీబ్, షేక్ బీబీ, బషీర్, మజర్, మహేష్, రవీందర్, ఖలీమ్, నాగార్జున, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
