SAKSHITHA NEWS

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత..?

హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌ పెను సంచలనంగా మారింది.

జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కుంటలను, ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణా లు చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోం ది. అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతుంది.

ఈ క్రమంలో పలువరు హైడ్రా కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా రు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటికి భద్రత పెంచింది. మధుర నగర్‌లో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది.

ఇందులో భాగంగా.. కమిష నర్‌ రంగనాథ్‌ నివాసం దగ్గర ఔట్‌పోస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కాగా నగరంలో ఇటీవల హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిష నర్ గా ఉన్న రంగనాథ కు ముప్పు పొంచి ఉండటంతో ఈ భద్రత ఏర్పాటు చేశారు.


SAKSHITHA NEWS