SAKSHITHA NEWS

చిన్న బ్రేక్‌ అంతే..! ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. అనంతపురంజిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా వారి సమస్యలేంటో తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్‌.

మరోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్‌ చేపట్టిన బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కర్నూలుజిల్లాలో బస్సుయాత్ర పూర్తి చేసిన జగన్‌.. అనంతపురంజిల్లాలో కొనసాగిస్తున్నారు. ఆదివారం ఈస్టర్‌ సందర్భంగా స్వల్ప బ్రేక్‌ ఇచ్చారు. సోమవారం ఉదయం 9 గంటలకు సంజీవపురం క్యాంప్‌ సైట్‌ నుంచి బస్సు యాత్ర కొనసాగిస్తారు.

ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర ఐదో రోజు షెడ్యూల్‌ ప్రకారం.. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్పి కొట్టల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. ఆ తర్వాత పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్‌ హాల్‌లో మైనారిటీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవపురం క్యాంప్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఈస్టర్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు సీఎం జగన్‌. దాంతోపాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీలు కొనసాగాయి. పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్‌కి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతోంది. పల్లె పల్లెలో సీఎం జగన్‌కు మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

WhatsApp Image 2024 03 31 at 8.57.14 PM

SAKSHITHA NEWS