సావిత్రిబాయి పూలే జయంతిని ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు

సావిత్రిబాయి పూలే జయంతిని ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు

SAKSHITHA NEWS

Savitribai Phule Jayanthi was organized by the Principal

image 7

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని జడ్పీ హైస్కూల్లో భారతదేశ మొదటి మహిళ సాదికారని సావిత్రిబాయి పూలే జయంతిని ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు

భారతదేశ మొదటి మహిళా సాధికారిని సావిత్రిబాయి పూలే

యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్

మండల కేంద్రంలోని స్థానిక జెడ్పి హైస్కూల్లో టీఎస్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ ముసిపట్ల రేణుక, ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘసంస్కర్త, కవి, రచయిత్రి మరియు విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.

అట్టడుగు వర్గాలకు, మహిళలకు, చదువు, సంపద, గౌరవం నిరాకరించబడిన ఈ దేశంలో ఆనాటి సమాజ కట్టుబాట్లను, బ్రాహ్మణ సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మే 12,1848న బహుజనులకు మొట్టమొదటి పాఠశాలను, తన జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలను ప్రారంభించి తన జీవితాన్ని విద్యాబోధనకు అంకితం చేసిన త్యాగమయులన్నారు. మహిళలను చైతన్యపరిచి, వారిలో సాధికారతను పెంచేందుకు 1852లో “మహిళా సేవా మండల్” అనే మహిళా సంఘాన్ని స్థాపించిందన్నారు. “మహిళల హక్కులే – మానవ హక్కులనీ” నినదించిన మొదటి మహిళ సావిత్రిబాయి పూలే అన్నారు.

అసత్యాలతో, వర్గ వైశాల్యాలతో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోదించడానికి తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి “సత్యశోధక సమాజం” ప్రారంభించి బాల్యవివాహాలను, మూఢనమ్మకాలను, సతీసహగమనానికి వ్యతిరేకంగా మరియు వితంతు పునర్వివాహాలకై బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపిందన్నారు. బాల్యంలోని వైధవ్యాన్ని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిందన్నారు. గర్భవతులైన వారికి పురుల్లు పోసి వారి కళ్ళల్లో వెలుగులు నింపిందన్నారు.

వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపరచి శిరోముండనం చేయబోమని వారిచేత 1860 లో సమ్మె చేయించిందన్నారు. 1873 డిసెంబర్ 23న మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించి దేశం నివ్వరపోయేలా చేసిందన్నారు. 1870 మరియు 1896 లలో దేశంలో తీవ్ర కరువు సమయంలో కరువువాత పడిన కుటుంబాలలోని 2000 మంది అనాధలను చేరదీసి భోజనాలు పెట్టిందన్నారు. రచయిత్రిగా 1854లో కావ్య పూలే, 1891లో “కాశీ సుబోధ్ రత్నాకర్” అను కవితా సంపుటాలను లను ప్రచురించిందన్నారు. తన భర్త చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సాంప్రదాయానికి తెరలేపిందన్నారు.
1897 లో ప్లేగు వ్యాధి ప్రబలడంతో ప్రజలందరూ నగరాన్ని ఖాళీ చేసి అడవులకు వెళ్లినప్పటికీ, తాను మాత్రం వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరాలను నిర్వహించిన సాంఘిక సేవ పరాయిని అన్నారు.క్రాంతిబాయి గా పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో పిఆర్ టియు టిఎస్ బాధ్యులు కరుణాకర్ రెడ్డి, పిఆర్టియు తెలంగాణ బాధ్యులు తిరుపతిరెడ్డి, ఎస్టియు బాధ్యులు బాలాజీ, ఎస్జిటియు బాధ్యులు విజయ్ పాల్ రెడ్డి, టి పస్ బాధ్యులు శివకుమార్, డిటిఎఫ్ బాధ్యులు శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS