బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి భాయి పూలే గారి 192 వ జయంతి.

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి భాయి పూలే గారి 192 వ జయంతి.

SAKSHITHA NEWS

Savitri Bhai Phule’s 192nd birth anniversary is celebrated under the leadership of Bahujan Samaj Party.

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి భాయి పూలే గారి 192 వ జయంతి.

సాక్షిత న్యూస్, మంథని:

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, మహిళల చదువు కోసం అనేక పాఠశాలను ప్రారంభించి అందరికీ విద్యను అందించిన మానవతా మూర్తి మాతా ” సావిత్రి భాయి పూలే ” 192 వ జయంతి సందర్భంగా మంగళవారం బీఎస్పీ నాయకులు మంథని అంబేద్కర్ చౌరస్తా వద్ద సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంథని నియోజకవర్గ ఇంచార్జి జనగామ రవికుమార్, స్వేరొస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జాల లక్ష్మణ్, మంథని మండల కన్వీనర్ బూడిద గట్టయ్య, మల్హర్ రావు మండల కన్వీనర్ గుగ్గిల్ల రాజ్ కుమార్, మంథని సెక్టార్ అధ్యక్షులు కాసిపేట రాజ్ కుమార్, గద్దలపల్లి ( ధర్మారం ) సెక్టార్ అధ్యక్షులు గడ్డం శేషాద్రి, కల్వచర్ల సెక్టార్ అధ్యక్షులు బొంకూరి అజయ్, జల్లారం సెక్టార్ అధ్యక్షులు రేనికుంట్ల మల్లేష్, మంథని సెక్టార్ కన్వీనర్ కే. శ్యామ్, ఉప్పట్ల బూత్ అధ్యక్షులు చకినరపు లక్ష్మణ్, బూత్ ఉపాధ్యక్షులు కాసిపేట నరేష్, సదానందం పాల్గొన్నారు.


SAKSHITHA NEWS