శంకర్పల్లి లో పతి గెలుపు కోసం సతి సాహస ప్రచారం
శంకర్పల్లి: నవంబర్ 24: (మన సాక్షి న్యూస్): ఏడు అడుగుల బంధమే కాదు కష్టమైనా సుఖమైన మీలో సగమే అనేది భార్యభర్తల బంధం. ఇప్పుడు ఇదే స్ఫూర్తి ఈనాటి రాజకీయాల్లో కూడా కొనసాగుతోంది. చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ గెలుపు కోసం ఆయన సతి జ్యోతి సాహస ప్రచారం చేస్తోంది. శుక్రవారం శంకర్పల్లి మండల పరిధి మహాలింగాపురం గ్రామంలో గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను ఆమె కోరారు. ఈ సందర్భంగా జ్యోతి గ్రామాలలో పర్యటిస్తూ బిజీబిజీగా దూసుకుపోతున్న విషయం విధితమే. అయితే నేను కూడా మీ వెంటే అంటూ తన భర్త పామేన భీం భరత్ ను గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తోంది. ఆమె ప్రతి ఇల్లు తిరుగుతూ చేతి గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. చేవెళ్లలో ఈసారి చేతి గుర్తును గెలిపించు కుందామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఓట్లను అడిగారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ మహబూబ్ హుస్సేన్, నిజాం సమీ, సమ్మిద్దిన్, అజ్మత్, యూసుఫ్, కాజా ఉన్నారు.