SAKSHITHA NEWS

Sarvajna School Student in World Book of Records

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సర్వజ్ఞ పాఠశాల విద్యార్ధి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నగరంలోని వి.డి.వోస్ కాలనీలోగల సర్వజ్ఞ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గుత్తికొంట మాని జనరంజకంగా కూచిపూడి నృత్యం చేసి 10వ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది.

ఆదివారం రాత్రి ఏపీ రాష్ట్రంలో ని విజయవాడలో గల సంగీత కళాశాలలో ఘంటసాల గోకరాజు కళావేదిక పై నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే సమయంలో 135 నిమిషాల నిడివిగల మహిషాసుర మర్దిని పాటకు నృత్యం చేసి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది.

ఆమెకి ఈ మేరకు ధృవపత్రాన్ని అందజేసి పతకంతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ కె. నీలిమా మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్ధిని మాన్విని అభినందించారు. తమ స్కూల్ విద్యార్థులను చదువుతో పాటు అన్ని రకాల అంశాలలో ప్రోత్సాహించి ముందుంచడానికి వినూత్న ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలిపారు.

విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభ వెలికితీసి తీర్చిదిద్దేందుకు తమ విద్యాసంస్థలో విద్యార్థులకు విద్యతో పాటు సంగీతం, సాహిత్యం, నృత్యం, పెయింటింగ్ వంటి కళలో ప్రత్యేక శిక్షణను క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు తెలిపారు.


అనంతరం పతక గ్రహీత మాన్విని ఆమెతో పాటు డైరక్టర్ ఆర్.వి. నాగేంద్ర కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు.


SAKSHITHA NEWS