300 పడకల ఆసుపత్రిని అఫ్ గ్రేడ్ చేస్తూ 500 పడకల ఆసుపత్రికి కృషి చేస్తూ, అసంపూర్తి పనులను పూర్తి చేసిన ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కోరిన….
- జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ…
- ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్….
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 300 పడకల ఆసుపత్రి అసంపూర్తి పనులను పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహా ని సెక్రటేరియట్ లో తన చాంబర్ లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య మరియు ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసినారు… - 300 పడకల ఆసుపత్రిని అఫ్ గ్రేడ్ చేస్తూ 500 పడకల ఆసుపత్రికి కృషి చేస్తూ, అసంపూర్తి పనులను పూర్తి చేసిన ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని మంత్రిని కోరారు… నర్సింగ్ కళాశాలకు కావలసిన మౌలిక వసతుల కల్పిస్తూ,మండల కేంద్రాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అదనపు సౌకర్యాలు కల్పించి గ్రామాలలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి కృషి చేయాలని ఆంధ్ర,కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న నడిగడ్డ ప్రాంతా ప్రజలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలోని ఆసుపత్రిలో కుడా ఆరోగ్య శ్రీ పథకం క్రింద వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ను సరితమ్మ, సంపత్ కుమార్ కోరారు….అందుకు మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు…
,,,,,,,,,,,,,,,,