SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 18 at 6.34.39 PM

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
హుస్నాబాద్ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం నియోజవర్గ కన్వీనర్ కల్లుగీత కార్మిక నాయకుడు పచ్చిమట్ల రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అగ్రవర్ణాల ఆధిపత్యాలను ఎదిరించిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

మొగులుల రాజ్యాధికారంలో బహుజనుల బాధలు చూడలేక, మాన ప్రాణాలను కాపాడేందుకు సహజంగా గీతా కార్మికుడైన సర్దార్ సర్వాయి పాపన్న 40 వేల మంది బహుజన సైనికులను తయారుచేసి గోల్కొండ కోటను జయించడం జరిగిందన్నారు. ఆరు నెలలు పరిపాలన చేసిన తర్వాత కుట్రలు చేసి సర్దార్ సర్వాయి పాపన్నను చంపడం జరిగిందని తెలిపారు. తెలివితో, బుద్ధిబలంతో బలమైన సామ్రాజ్యాన్ని కూల్చిన చరిత్ర అతనిదని అటువంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ , మైనార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉన్నదని, తద్వారానే బహుజనుల కష్టాలు తీరుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నాయకులు రాంభూపాల్ రెడ్డి మాజీ ఎల్లమ్మ గుడి చైర్మన్ పూదరి రవీందర్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పూదరి రవీందర్, పూదరి వరప్రసాద్, బొమ్మగాని సతీష్, తాళ్లపల్లి లక్ష్మణ్, కోహెడ శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు పూదరి శ్రీనివాస్ పెరమాండ్ల నరస గౌడ్, పూదరి కనకయ్య, మాజీ వార్డ్ సభ్యులు పెరుమాండ్ల శ్రీనివాస్, పూదరి రవీందర్, సుదవోని కనకయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్ బండి శంకర్ తదితరులున్నారు.


SAKSHITHA NEWS