ముంబైలో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
బంజారా జాతి ధిక్కార స్వరం. లంబాడి జాతి ప్రజలకు దశ దిశ చూపిన మార్గదాత. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన యోధుడు సంత్ సేవాలాల్ మహారాజ్. ఆయన జన్మదిన వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. గురువారం తూర్పు కంజూర్ మార్గ్ ప్రాంతంలో బంజారా సేవా సంఘం, 11 తండాలకు చెందిన ఘోరమాటీల అధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించారు. ఈ పండుగ సందర్బంగా మహిళలు తమ సాంప్రదాయ దుస్తులు ధరించారు. పిల్లలతో సహా డ్యాన్స్ చేశారు. ఈ ఏరియాలో రంగారెడ్డి, వికారాబాద్, దౌలతాబాద్, మెహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కనీసం నాల్గున్నరవెల మంది లాంబడిలు నివాసమైన ఉన్నారు. వీరు గత ఐదు ఏండ్లుగా తమ “కుల అస్తిత్వ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి అథితిగా స్థానిక ఎం.ఎల్.ఏ సునీల్ బావు రాహుత్ (ఉద్ధవ్ ఠాక్రే పార్టీ) హాజరై శుభాకాంక్షలు తెల్పారు. ఇందులో సంస్థ ప్రముఖులైన బందు రత్నవత్ నాయక్, రమేష్ రాథోడ్, రాజు పాట్లవాత్, విశ్లవత్ శంకర్, గణేష్ సభావత్, పాట్లవత్ లక్ష్మణ్, గాయకులు పాట్లవత్ పండు, ముడవత్ సంతోష్, విశ్లవత్ మంగ్లిబాయి, గాంగిబాయి పాట్లవత్, దేవిబాయి సభావాత్, విశ్లవత్ వాలీబాయి, సోనిబాయి విశ్లవత్ తదితర్లు పాల్గొన్నారు. తోడుగా బహుజన నేతలైన నరపాక లక్ష్మణ్, కున్బి నారాయణ, తెలుగు సమాచార్ ఎడిటర్ సిరిమల్లె శ్రీనివాస్, కార్మిక నేత చౌవల్ రమేష్, గాయకులు భీంరత్న మాలజీ, మూల్ నివాసి మాలజీ ఉత్సవంలో పాల్గొన్నారు.