SAKSHITHA NEWS

సెల్యూట్ మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్

విధి నిర్వాహాణలో పోలీస్ శాఖ అత్యంత విలువైన పాత్ర అనేది అందరికి తెలుసు

అలాంటి పోలీస్ శాఖలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న వాగులు కాలువలు

గుంటూరు విజయవాడ ప్రధాన రహాదారి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వరద నీరు రోడ్డుపైకివచ్చి ట్రాఫిక్ అంతరాయం అని విషయం తెలుసుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు

పరిస్థితి స్వయంగా రంగంలోకి స్థానికుల సహాయంతో వాహానాలను జాగ్రత్తగా పంపే ప్రయత్నం అటుగా ప్రయాణం చేస్తున్న వారితో సెభాష్ పోలీస్ అనేలా చేశారు

తమ ఆరోగ్యం ముఖ్యం కాదని ప్రజలను సేఫ్టీగా ఇళ్ళకు పంపాలని ఆయన విధి నిర్వహణకు సెల్యూట్

ఆయన ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు వాహానాలలో వచ్చే వారు రావద్దని 2 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవాహం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు

అత్యవసరం అయితే తప్పించి బయటకు రావద్దని అసలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హితవు పలికారు

ఏది ఏమైనా ఇలాంటి ఆఫీసర్ సమాజానికి కావాలి భరోసా ఇస్తు విధులు నిర్వహిస్తున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ కు హెట్సాఫ్ సెల్యూట్


SAKSHITHA NEWS