SAKSHITHA NEWS

ముంబయి:
భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు.

స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే.. సచిన్‌ వీవీఐపీ సెక్యూరి టీలో విధులు నిర్వర్తిస్తు న్నాడు. మహారాష్ట్రలోని జామ్నెర్‌ పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన జరిగింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కాప్డే (39) కొన్ని రోజులు సెలవు తీసుకొని తన స్వగ్రామానికి వెళ్లినట్లు ఆ అధికారి తెలిపారు. అక్క డే తన సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు జామ్నర్ పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ కేసులో దర్యా ప్తు జరుగుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆత్మ హత్యకు పాల్పడి ఉండొ చ్చు. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడవు తాయి అని చెప్పారు.

అతడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాప్డే వీవీఐపీ సెక్యూరిటీలోని గార్డు కావడంతో.. ఈ ఘటనపై ఎస్ఆర్‌పీఎఫ్‌ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించను న్నట్లు తెలుస్తోంది.

WhatsApp Image 2024 05 15 at 16.48.04

SAKSHITHA NEWS