SAKSHITHA NEWS

మైలవరంలో సంక్షేమానికి రూ.31.99 కోట్లు, అభివృద్ధికి రూ.6.55 కోట్లు
శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి._*
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం

సాక్షిత : మైలవరం పట్టణంలోని మూడు సచివాలయాల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు సంక్షేమానికి రూ.31.99 కోట్లు వెచ్చించినట్లు, మైలవరం పట్టణంలో అభివృద్ధి పనులకు రూ.6.55 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు.

మైలవరంలోని బాలయోగి నగర్లో, సూరిబాబు పేటలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 రోజుల పాటు మైలవరం పట్టణంలోని మూడు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం పూర్తయినట్లు వెల్లడించారు. ప్రజలు చెప్పిన స్థానిక సమస్యల పరిష్కారానికి తాజాగా రూ.60లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పథకం కింద అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేస్తామని ప్రకటించారు.

సాంకేతి కారణాలు మినహాయించి అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఎటువంటి వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలను వర్తింపజేసినట్లు వెల్లడించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులు పూర్తిచేస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రతిగడపలో సీఎం జగనన్నకే మా ఆశీస్సులు ప్రజలు దీవించారని వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS