SAKSHITHA NEWS

[18:45, 31/08/2024] SAKSHITHA NEWS: జిల్లా లో రూ.2 లక్షల 39 వేల 924 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు
-రు.102 కోట్ల 31 ల క్షల 63 వే ల 500 లను లబ్ధిదారులకు పింఛన్లు గా అందిస్తున్నాం
-ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశాం
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్


సాక్షిత తూర్పుగోదావరి జిల్లా :
జిల్లాలో 2 లక్షల 39 వేల 924 మందికి రూ.102 కోట్ల 31 లక్షల 63 వేల 500 రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటో గ్రఫీ మంత్రి కందుల దుర్గే ష్ పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లి, ఉండ్రాజవరం మండలం కె. సావరం, నిడదవోలు మండలం సమిశ్ర గూడెం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఒక రోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. నిడదవోలు అర్బన్ సంబంధించి 4295 మందికి ఒక కోటి 88 లక్షల 48 వేల 500, నిడదవోలు రూరల్ సంబంధించి 10520 మందికి 4 కోట్ల 50 లక్షల 78 వేల 500, ఉండ్రాజవరం మండలంలో 10 వేల 483 మందికి 4 కోట్ల 46 లక్షల 81 వేల 500 పెరవలి మండలం 10 వేల 371 మందికి 4 కోట్ల 36 లక్షల 57 వేల రూపాయల పెన్షన్లు నగదు చెల్లింపు ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద నిడదవోలు నియోజక వర్గం లో రూ.11 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకం గా ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నా మన్నారు.


ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన అర్హులైన లబ్ధిదారులు అందరికీ పెన్షన్ అంద జేస్తున్నామన్నారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారు జాము నుంచే లబ్ధిదారుల ఇంటి వద్ద కే వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రాధాన్యత క్రమంలో హామీలను నెరవేర్చుతున్నా మన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్ లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు, అధికారులు మండల ప్రత్యేక అధికారి, ఎ.దుర్గేష్ ఎంపి డిఓ, పి. శామ్యూల్, మండల తాహి సిల్దార్ బి. నాగరాజు నాయక్, ఉప్పులూరు రామ్మోహన్ రావు, యం. డి. అక్రమ్, ముప్పిడి రాజరత్నం, త దితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS