
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో ఉన్న రోహిత రెసిడెన్సీ, ఎన్సీఎల్, శ్రీ చక్ర అపార్ట్మెంట్ మరియు అక్కడ ఉన్న ప్రజలు బాదం చెట్టు ఫంగస్ వల్ల తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియపర్చగా, తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో క్రేన్ తెప్పించి దగ్గర ఉండి కొమ్మలను ట్రిమ్మింగ్ చేయిస్తున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, బృందావన్ కాలనీ లో ఉన్న రోహిత రెసిడెన్సీ, ఎన్సీఎల్, చక్ర అపార్ట్మెంట్ మరియు అక్కడ ఉన్న ప్రజలు బాదం చెట్టుకు ఫంగస్ వల్ల ఆరోగ్య సమస్యలు, ఇంటి సామాన్లు మరియు పార్కింగ్ చేసిన బండ్లు కారులు చెడిపోతున్నాయని నాకు తెలియపర్చగా, తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో క్రేన్ తెప్పించి దగ్గర ఉండి కొమ్మలను ట్రిమ్మింగ్ చేయిస్తున్నానని చెప్పడం జరిగింది, అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.
ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app