Rice sticks are kindling
- వేడికి సారం కోల్పోతున్న భూమి – మంటలకు మాడిపోతున్న పోషకాలు
- నేలలో కలవకుండా దిగుబడిపై ప్రభావం – రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమైన వ్యవసాయ శాఖ అధికారులు
సాక్షిత న్యూస్ సూర్యపేట జిల్లా ప్రతినిధి : వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమిలో సారం తగ్గుతోంది. దీనిపై వ్యవసాయాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు. భూసారం తగ్గడంతో పాటు భవిష్యత్ లో భూమిలో పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గే ప్రమాదముంది. గత సంవత్సరం జిల్లాలో వరి కొయ్యల మంటల్లో, పొగ వల్ల ఇద్దరు రైతులు మృతిచెందారు. యాసంగి సీజన్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సీజన్లో వరి కోతలు పూర్తి కాగా పొలంలో మిగిలిపోయిన వరి కొయ్యలను రైతులు కాల్చివేస్తు న్నారు. వరి కొయ్యలను కాల్చివేయడం వల్ల పంటలకు అధిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాగా గతంలో రైతులు వరిపంటను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు.
పశు వులు ఎక్కువగా ఉండడంతో గడ్డిని కుప్పలు కుప్పలుగా పశుగ్రాసం కోసం వినియోగించేవారు. ప్రస్తుతం వ్యవసాయంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గడంతో యంత్రాల వాడకం విపరీతంగా పెరిగింది. వరి పొలాన్ని కొయ్యడానికి మిషన్, హార్వెస్టింగ్ సహాయంతో పొలాలను పైకి కొస్తున్నారు. మరో సీజన్ ప్రారంభంలో పొలం దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని చాలా మంది రైతులు వరి కొయ్యలతో పాటు గడ్డి కూడా తగలబెడుతున్నారు.
వరి కొయ్యలను కాల్చి వేయడం వల్ల భూసారం తగ్గుతోంది. రైతులు వరి కొయ్యకాల్లకు నిప్పుపెట్టి బూడిద చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భూమిలో పంటకు ఉపయోగం అయ్యే క్రిమీ, కీటకాలు కూడా చనిపోతున్నాయి. దీని వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీర్ఘకాలంలో రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వరి కొయ్యలను కాల్చివేయడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి గాలిలో చేరి, కాలుష్యం ఏర్పడుతుంది.
అలా కాకుండా వరి కొయ్యకాల్లకు నిప్పు పెట్టకుండా వరి కొయ్యలను అలాగే పోలంలో నీటిని పెట్టి వరి కొయ్యలు కుళ్లిపోయేలా చేసి, దున్నితే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు కానీ వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల జరిగే అనర్థాలను గ్రామ స్థాయిలో రైతులకు వివరించడం లో వ్యవసాయ అధికారులు విఫలమవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరికొయ్యలను కలియదుక్కిదున్నే సమయంలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే ఆవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల రైతులపై డీపీపీ వాడక భారం తగ్గుతుంది. మొక్కలకు రెండు శాతం నత్రజని ( యురియా) నాలుగు శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది.
నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. జింక్, మాంగ నీస్, ఇనుము, కాల్షియం లాంటివి పంటకు మేలు చేస్తాయి. వరి కొయ్య లను భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. భూమికి నీటిని, పోషకాలను నిల్వ ఉంచే గుణం పెంచుతుంది. వాయు కాలుష్యం జరగకుండా ఉంటుంది. కొయ్యకాలు కుళ్లడంతో పంటకు ఎరువుగా ఉపయోగపడి దిగుబడులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
epaper Sakshitha
Download app