Response Grievances should be resolved in time – Commissioner Anupama
స్పందన పిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి – కమిషనర్ అనుపమ అంజలి
సాక్షితతిరుపతి * : తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే స్పందన పిర్యాదులను, అదేవిధంగా డయల్ యువర్ కమిషనర్ కి వచ్చే పిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులనుద్దెసించి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో కమిషనర్ అనుపమ అంజలి పిర్యాదులను స్వీకరించారు. బైరాగిపట్టెడలోని ఓక మటన్ షాపులో కొన్న మాంసం పాడైనది అని అడగగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఓకరు పిర్యాదు చేయగా తనిఖిలు నిర్వహిస్తామన్నారు.
శ్రీనివాసం నుండి టి.ఎం.ఆర్ కు వెల్లెటప్పుడు పుట్ పాత్ త్రవ్వి వదిలేసారని, సీతమ్మ ట్రస్ట్ వద్ద రోడ్డు ఆద్వాన్నముగా వున్నదని, బ్లిస్ ముందు పెద్ద కాలువ కూలి పోయిందని, హరిచంద్ర శ్మశానవాటికను ఆక్రమిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో మురికి నీటి కాలువలు సరిగా శుభ్రం చేయడం లేదనే పిర్యాదులను సంబంధిత అధిజారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అదేవిధంగా పిర్యాది దారులకు హామి ఇస్తూ వారు సూచించిన పిర్యాదులపై తక్షణమే తమ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపడుతారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, లోకేష్ వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు, సూపర్డెంట్ పి.రవి, మెప్మా వెంకటరమణ తదితర అధికారులు పాల్గొన్నారు.*