SAKSHITHA NEWS


Resolve HMT workers issues faster

హెచ్ఎంటీ కార్మికుల సమస్యలను వేగంగా పరిష్కరించండి…

హెచ్ఎంటి సీఎండి పంకజ్ గుప్తతో సమావేశమైన ఎమ్మెల్యే…


సాక్షిత : హెచ్ఎంటి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హెచ్ఎంటీ సీఎండి పంకజ్ గుప్త (చైర్మన్) తో కలిసి చింతల్ హెచ్ఎంటీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్ఎంటీ కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

కంపెనీలో ప్రొడక్షన్ కి అవసరమయ్యే వర్కింగ్ క్యాపిటల్, కొత్త నియామకాలపై ప్రత్యేక చొరవ చూపి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదే విధంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు 5 సంవత్సరాల నుండి పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు సెటిల్‌మెంట్ అలవెన్స్‌ల వరకు న్యాయబద్ధంగా రావాల్సింది నిలిపివేయడంతో రిటైర్డ్ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వారికి వెంటనే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎండి ని ఎమ్మెల్యే కోరారు.

దీంతో సీఎండి సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ లీడర్లు శ్రీశైలం, ఆనంద్, రవి, శ్రీనివాస్ నాయక్, చారి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS