స్థానిక మయూరి సెంటర్ ఆర్వోబి మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఖమ్మం :
స్థానిక మయూరి సెంటర్ ఆర్వోబి మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ మయూరి సెంటర్ ఆర్వోబి మరమ్మత్తు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, చేపట్టాల్సిన పనులు, ఇప్పటికి పూర్తయిన పనుల విషయమై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్వోబి మరమ్మత్తు పనులు చేపట్టి ప్రగతిలో ఉన్నాయన్నారు. మెయిన్ బీమ్ ల, క్రాస్ బీమ్ ల మరమ్మత్తులు జరుగుతున్నట్లు తెలిపారు. స్లాబ్ క్రింది భాగంలో అవసరమైన చోట పునరుద్ధరణ పనులు జరుచున్నట్లు ఆయన అన్నారు. బీములకు గ్రౌటింగ్ పనులు 45 కు గాను 21 పూర్తయినట్లు ఆయన తెలిపారు. అప్రోచ్, ఫుట్ పాత్ ల నిర్మాణం చేయాల్సివుందన్నారు. దెబ్బతిన్న భాగాల మరమ్మత్తులు పూర్తి చేయాలన్నారు. కూలీల సంఖ్యను పెంచి, పనుల్లో వేగం పెంచాలని ఆయన తెలిపారు. అగ్రిమెంట్ సమయంలోగా పనుల పూర్తికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, ఆర్ అండ్ బి ఏఇఇ విశ్వనాథ్, అధికారులు తదితరులు ఉన్నారు.