SAKSHITHA NEWS

Raza Youth felicitated the members of Kabarstan Khemed Seva Sanstha

image 29

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కబరస్తన్ ఖే్మద్ సేవా సంస్థ సభ్యులను ఘనంగా సన్మానించిన రజా యూత్ సభ్యులు

మరణించిన ముస్లిం సోదరులకు అంత్య క్రియలు చేయాలని మరణించిన కుటుంబాల బాధలను పాలుపంచకుకోవాలనే సదుద్దేశంతో
ముస్లిం సోదరులు గత 15 సంవత్సరాల క్రితం జమ్మికుంట లో కబారస్తన్ కిస్మాత్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.

జమ్మికుంట లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు భోజన సౌకర్యాలు చేస్తూ ఆసరాగా నిల్చుంటున్నారు. కరోనా కష్టకాలంలో సైతం 75 నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మరణించిన 131మంది పేద ముస్లిం సోదరులు అంతిమ కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిoచారు. వీరి సేవలకు. గుర్తించి జమ్మికుంట మండల పరిధిలోని బిజిగిర్ షరీఫ్ దర్గా అవరణలో రజా యూత్ అధ్వర్యంలో సేవా సంస్థ కమిటీ సభ్యులను ఘనంగా 25 మందికి శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్బంగా ఖబ్రస్థాన్ కిద్మత్ సభ్యులు సలీం మరియు మరియు ఖురేషి మౌలానా నజీర్ మరియు ఇంద్ర నగర్ జాకీర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు మరణిస్తే వారి అంతిమ కార్యక్రమాలు చేయలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను చూసి మావంతు సహాయం చేయాలనే ఆలోచనతో కబరస్థన్ కీస్మత్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ముస్లిం కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే మేమున్నామంటూ ముందుండి స్వచ్ఛందంగా అంతిమ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాల బాధను తగించడానికి మావoతు సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. మా సేవను గుర్తించి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో రజా యూత్ కమిటీ తో పాటు ఖ బ్రస్తాన్. కమిటీ సభ్యులు ఎస్ కే ఉబేదుల్లా, మహమ్మద్ ఫిర్దోస్, సమీర్, అక్బర్, జానీ, పర్వేజ్, మునీర్, బిలాల్, ఖలీల్, కాజా పాషా, ( ఇంద్రనగర్ జాకీర్ ) మసీద్ మతగురు


SAKSHITHA NEWS