SAKSHITHA NEWS

సాక్షిత : పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ ప్రధాన రహదారి పై గల మసీదు వద్ద అఫ్రోజ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ ఈద్ మిలాప్ కార్యకమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.*

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ త్యాగం, దయ,సాహనుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ పర్వదినం ముగిసిన తర్వాత ఆత్మీయ కలయికనే ఈద్ మిలాప్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం ,సంస్కారం అలవడుతుందని ,మతసామరస్యానికి ప్రతీక అని అల్లా దీవెనలతో ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వాదాలు అందాలని కోరారు.

అదేవిధంగా ముస్లిం మైనారిటీ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేష్, డివిజన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, నాయకులు నక్క శ్రీనివాస్, సిందం శ్రీకాంత్, ఫిరోజ్ ఖాన్, పప్పు, సత్తార్, సద్దాం, అజాం, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS