SAKSHITHA NEWS

పోటాపోటీగా ఘనంగా రాజీవ్ గాంధీ80 వ జయంతి వేడుకలు

సాక్షిత వనపర్తి
మంగళవారం దివంగత రాజీవ్ గాంధీ 80 వ జయంతి నీ పురస్కరించుకుని వనపర్తి కాంగ్రెస్ పార్టీ మూడు వర్గాల ఆధ్వర్యంలో పోటాపోటీగా వేరువేరుగా రాజీవ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి కేకులను కట్ చేసి ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలను నిర్వహించి నివాళులు అర్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మూడు వర్గాల ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, లక్కాకుల సతీష్ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ లు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ భారతదేశ ఉన్నతి కోసంఎన్నో దీర్ఘకాలిక స్వల్పకాలిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేయడం జరిగిందని సాంకేతిక విప్లవం తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని దేశం కోసం తన ప్రాణాలని అర్పించిన మహా నాయకుడని అభివర్ణిస్తూ కొనియాడుతూ రాజీవ్ గాంధీ అమర్ హై అని నినాదాలు చేస్తూ ఆయన ఆశయాలను సాధిస్తామని నినదించారు

మూడు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం………… దివంగత స్వర్గీయ మాజీ ప్రధానిరాజీవ్ గాంధీ 80 వ జయంతి వేడుకలను రాజీవ్ చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద నిర్వహించేందుకు వనపర్తి కాంగ్రెస్ పార్టీ మూడు వర్గాలు తమ తమ నాయకుల కార్యకర్తలను పోగుచేసు కునే క్రమంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు లారీలు డీసీఎంలు కార్లు టూ వీలర్స్ నాలుగు దిక్కులుగా వెళ్లే వాహనాలన్నీ పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ వర్గాల గురించి బాహాటంగానే బయటపడడం తో ప్రజల్లో చర్చ మొదలైంది వనపర్తి కాంగ్రెస్ పార్టీలో చీలికలను సమన్వయం చేసుకోవడానికి నియోజకవర్గ ముఖ్యనాయకులే పూనుకుంటారో లేక అధిష్టానమే పూనుకుంటే తప్ప వర్గాలుగా చీలిన వనపర్తి కాంగ్రెస్ పార్టీని ఒక తాటిపైకి తీసుకురావడం కష్టంగా మారుతుందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు

ఇప్పటికే ప్రోటోకాల్ పేరుతో రాజుకున్న ఆదిపత్య పోరు నడుస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంచాది చోటుచేసుకుని ఫలితాలుతారుమారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకులు పార్టీ సింపతి పరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ మార్కెట్ యాడ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ లక్కాకుల సతీష్ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ కోట్ల రవి నందిమల్ల యాదయ్య కమ్మర్ మియా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి అడ్వకేట్ కిరణ్ కుమార్ రాగి వేణు కౌన్సిలర్లు విభూదినారాయణ నక్క రాములు కౌన్సిలర్ పద్మ పరశురాం కౌన్సిలర్ బ్రహ్మం మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ తిరుపతయ్య పెంటన్న యాదవ్ దాసరాజుల భాస్కర్,ఎండి షఫీ రామకృష్ణారెడ్డి పూజారి వెంకటస్వామి పిట్టల శీను కదిరి రాములు వెంకటేశ్వర రెడ్డి కుమార్ గోకం వెంకటి ఈరపోగు శ్రీనివాసులు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS