రావులపాలెం సిఐగా బాధ్యతలు స్వీకరించిన రజనీ కుమార్
రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎన్. రజనీ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ 1 టౌన్ నుంచి బదిలీ అయి రావులపాలెం సిఐగా నియమితులయ్యారు. మండలంలోని గోపాలపురంలో ఈ ఏడాది జూలై నెలలో తలెత్తిన ఒక వివాదం నేపథ్యంలో ఇక్కడ సిఐగా పనిచేస్తున్న ఎం.వెంకట నారాయణ బదిలీ అయ్యారు.
అప్పటి నుంచి ఇక్కడ ఇన్చార్జి సిఐగా పి.గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు. నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన రజనీ కుమార్ ను సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది, పలువురు అభినందించారు…