అంతర్జాతీయ మహిళా దొనోత్సవ సాక్షిగా బెల్టు షాపులను నివారించేవరకు విశ్రమించవద్దని
తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు.
చౌటుప్పల పురకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దొనోత్సవ వేడుకలు పండగ వాతారవరణంలా జరిగాయి.
మహిళలు ప్లే కార్డులు ధరించి బెల్టు షాపులను నివారిస్తామని నినదించారు, ప్రతిజ్ఞ చేశారు.
దిక్కులు పిక్కటిళ్లెలా బెల్టు షాపులను నివారిద్దమ్ – కుటుంబాలను కాపాడుకుందాం అని పెద్ద ఎత్తున నినాదం చేశారు.
బెల్టు షాపుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ
తెలంగాణ భావిషత్తు ఆశాకిరణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో మునుగోడు గడ్డ బెల్టు షాపులు నివారిస్తూ పుణితం అవుతుందన్నారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి పిలుపుతో బెల్టు షాపు నిర్వాహకులు తట్ట బుట్ట సదురుకొని చిత్తగించారని, ఇది మహిళాల విజయమని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక స్వావలంబనతో మహిళలు అన్నీ రంగాలలో ముందుకు వెళ్లాలని, మహిళలు తలుచుకుంటే సాదించలేనిది ఏదిలేదన్నారు. అన్నీ రంగాలకు సంబందించిన మహిళలను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమములో ఉప వైద్య అధికారి డా. యశోదా , మూన్సిపల్ కమీషనర్ యన్. వేంకటేశ్వర నాయక్ , తహశీల్దార్ యస్. హరి కృష్ణ , కౌన్సిలర్లు కసర్ల మంజుళ శ్రీనివాస్ రెడ్డి , కామిశెట్టి శైలజ భాస్కర్ , సందగల్ల విజయ సతీష్ , బాత్తుల రాజ్యలక్ష్మి స్వామి , కొయ్యడ సైదులు , పోలోజు శ్రీదర్ బాబు , విద్యా సంస్థల చైర్మెన్ ఉజ్జిని మంజుళ , తంగడపల్లి ప్రదానోపాద్యాయులు భార్గవి , వివిద రంగాల అధికారులు కవిత , శోభారాణి , RP లు, అంగన్వాడీలు మరియు ఆశ వర్కర్ల తో పాటు భారీ ఎత్తున మహిళలు హాజరయ్యరు. మహిళా దినోస్తవ వేడుక అసంతం బెల్టు షాపులపై ఉద్యమించే స్థాయిలో కన్నెర్రజేసింది.