సాక్షితశేరిలింగంపల్లి డివిజన్ : * పరిధిలో గల రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తన సొంత నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సాయిబాబా ఆలయం, మార్కండేయ స్వామి ఆలయం, సంతాన నాగలక్ష్మి అమ్మవారి ఆలయం ఆవరణలో భక్తులు వేచియుండుటకై స్లాబ్ వేయించగలరని స్థానిక భక్తులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని విజ్ఞప్తి చేయగా సోమవారం రోజున ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానిక రాజీవ్ గురుకల్ప, ఆరంభ టౌన్షిప్, సురభి కాలోని, సందయ్య నగర్, పాపిరెడ్డి కాలనీ తదితర కాలనీ కాలనీవాసులు ఆధ్యాత్మికతతో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొనడం వలన వారు వారు అనుకున్న పనులు సాయిబాబా స్వామివారి ఆశీస్సులతో, మార్కండేయ స్వామి వారి ఆశీస్సులతో, సంతాన నాగలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో, మాత కన్యకా పరమేశ్వర స్వామి ఆశీస్సులతో సకాలంలో నెరవేరుతాయని, ఈ ప్రాంత వాసులలో ఆధ్యాత్మికత ఏర్పడతాదని, భగవంతుని ప్రార్థించడంవల్ల అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆ భగవంతుడి సంకల్పంతో నిర్మాణం చేపట్టడం జరిగిందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుర్రం రవీందర్ రావు, రాజీవ్ గృహకల్ప వార్డ్ మెంబర్ శ్రీకళ, బసవయ్య, వెంకటేశ్వర్లు, కుమార్, బసవరాజ్ లింగాయత్, కుమారి, భాగ్యలక్ష్మి, రోజా, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రాగం నాగేందర్ యాదవ్ తన సొంత నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సాయిబాబా ఆలయం
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS