బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 06 30 at 5.27.20 PM

శాంతి భద్రతలకు విగాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

— ప్రజలు శాంతియుతంగా బోనాల పండుగ జరుపుకోవాలి

— క్రైం రివ్యూ సమావేశం నిర్వహణ

— భద్రత ఏర్పాట్లపై అధికారులకి పలు సూచనలు చేసిన రాచకొండ సిపి డీఎస్ చౌహాన్ ఐపిఎస్

యాదాద్రి భువనగిరి సాక్షిత

తెలంగాణ బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అధికారులని ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ నిర్వహణకు సంబంధించి రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎస్, కమిషనరేట్ ఆఫీసులో రాచకొండ పోలిస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులను ఆదేశించారు. అలాగే క్రైం రివ్యు సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రజల సహకారంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాలలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు.
అన్ని ప్రముఖ దేవాలయ ప్రాంగణాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక వేడుకల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో బోనాల వేడుకల సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని, తమ చర్యల ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లు చేసే సందర్భంలో తగిన సమర్థవంతమైన అధికారులకు విధులు అప్పగించాలని సూచించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా, వారు ఎటువంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్ బృందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మత సామరస్యం కాపాడడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన క్రైం రివ్యు సమావేశంలో, అన్ని జోన్లలో నేర శాతం తగ్గింపు కోసం చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల మీద నిఘా వేసి ఉంచాలని, వారు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ, ఐపీఎస్., డిసిపి అభిషేక్ మొహంతి ఐపిఎస్, డిసిపి జానకి ఐపిఎస్, డిసిపి రాజేష్ చంద్ర ఐపిఎస్, డిసిపి గిరిధర్ ఐపీఎస్, డిసిపి అనురాధ ఐపిఎస్, డిసిపి బాలస్వామి, ఐపీఎస్, డిసిపి సాయి శ్రీ, డిసిపి శ్రీబాల, డిసిపి శ్రీనివాస్, డిసిపి మురళీధర్, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ అడ్మిన్ నర్మద, అదనపు డీసీపీ షమీర్, అదనపు డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ లక్ష్మి, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page