SAKSHITHA NEWS

రేవంత్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు…

చెప్పులతో కొట్టి.. రేవంత్ బొమ్మ దహనం…

సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం సబ్ స్టేషన్ వద్ద రేవంత్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి బొమ్మను చెప్పులతో కొట్టి, దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్‌ ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో రైతులకు సరైన కరెంట్‌ అందించలేక పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంట్‌ అందింస్తుందని, దీంతో గతంలో మాదిరిగా రైతులకు ఆత్మహత్యలే తప్ప మరో దారి ఉండదని అన్నారు. రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS