SAKSHITHA NEWS

అనధికార వసతి గృహాలకు ఇళ్లను ఇస్తే శిక్ష తప్పదు
-ప్రవేటు వసతి గృహాలు, చైల్డ్ కేర్ కేంద్రాల తనిఖీలు
-అనుమతులు ఉన్న వసతి గృహాలలో పిల్లల్ని చేర్పించాలి


సాక్షిత రాజమహేంద్రవరం :
అనధికార వసతి గృహాలకు ఇళ్లను అద్దెకి ఇస్తే చట్టపరంగా వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు వచ్చిన వ్యక్తి యొక్క పూర్తి బయోడేటా సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పక్కాగా ఉన్నాయా లేదా అని తెలుసుకుని అద్దెకి ఇవ్వాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
జిల్లాలో ప్రవేట్ వసతి గృహాల నిర్వాహకులు తగిన అనుమతులు లేకుండా నిర్వహణా చెయ్యడం, పిల్లల సంరక్షణ కేంద్రాల మార్గదర్శకాలు పాటించకుండా నిర్వహణా వ్యవస్థ ఉండటం గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి జిల్లా వ్యాప్తంగా సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాలను, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, పిల్లల సంరక్షణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 19 చోట్ల , బుధవారం 15 చోట్ల వసతి గృహాలను సందర్శించి అక్కడ వసతులను పరిశీలించినట్లు తెలియ చేశారు.

ఆయా వసతి గృహాలలో కొన్నింటిలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అనుమతులు లేకుండా నిర్వహించే వాటిని తనిఖీల్లో అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్వహణా చేస్తున్న వాటి విషయంలో తగిన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యముగా మెనూ ప్రకారం ఆహారం అందించక పోవడం, పారిశుధ్య నిర్వహణ లోపాలు, లైటింగ్ తక్కువగా ఉండడం, పరిమితికి మించి వసతి గృహాలలో హోస్టలర్డ్ ఉండడం, ప్రభుత్వ ముందస్తుగా అనుమతితో కొన్ని వసతి గృహాలని నిర్వహించక పోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆయా భవనాల్లో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదేశించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తనిఖీలలో భాగంగా తగిన లేకుండా అనుమతులు లేకుండా నిర్వహించే వాటి విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శశాంక , ఇంచార్జ్ జిల్లా ఐసిడిఎస్ అధికారి కే. నాగలక్ష్మి , జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్ సందీప్ , అనుబంధ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారన్నారు. అనకాపల్లిలో ఆగష్టు 19 వ తేదీ ఘటన తరువాత జిల్లా వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అన్ని ప్రవేటు వసతి గృహాలలో, సంరక్షణ కేంద్రాల లో తనిఖీలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు.


నిర్వాహకులు తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించడం, ఆయా వసతి గృహాలలో త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణా, వంట వండే ప్రదేశంలో జాగ్రత్తలు, సీసీ కెమెరాలు ఏర్పాటు, నైట్ వాచ్ మ్యాన్ ఏర్పాటు , హాజరు వివరాలు నమోదు, హజరు పట్టిక నిర్వహణా తప్పనిసరి గా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా గుర్తించిన ముఖ్యమైన లోపాలు చాలా ప్రైవేట్ హాస్టళ్లు అధికారికంగా నమోదు కాకపోవడం, ఒక ప్రైవేట్ హాస్టల్ రాజమహేంద్రవరం అర్బన్ సచివాలయంలో నమోదు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. కొన్ని భవన పరిస్థితులు నివాస యోగ్యంగా లేకపోవడం, వసతి గృహాలలో ఎక్కువ భాగం అపార్ట్‌మెంట్లలో నిర్వహణా, ప్రైవేట్ హాస్టళ్లలో వసతి పొందుతున్న వాళ్ళల్లో కాలేజీకి వెళ్లే విద్యార్థులు మాత్రమే ఉండడం గుర్తించామన్నారు. వంటగది మరియు టాయిలెట్ పరిస్థితుల యొక్క పారిశుధ్యం మరియు పరిశుభ్రమైన పరిస్థితి ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా స్థాయి అధికారులు నగరంలో పలు వసతి గృహాలలో తనిఖీలు..

WhatsApp Image 2024 08 21 at 17.53.49

SAKSHITHA NEWS