SAKSHITHA NEWS

ప్రజలకు మరింత చేరువగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో విచారణ జరిపి వాటికి అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

బాధితులకు ఎల్లవేళలా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుంది.

సుదూర ప్రాంతం నుండి అర్జీలు సమర్పించడానికి వచ్చే బాధితులను దృష్టిలో ఉంచుకొని అర్జీదారుల కొరకు స్వయంగా ఎస్పీ ద్వారా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే సదుద్దేశంతో తలపెట్టిన స్పందన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఐపీఎస్ నిర్వహించి ఫిర్యాదుదారులు వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చే ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు తమ చేయి అందించి నడిపించుకొని తీసుకు వచ్చారు. అదేవిధంగా సుదూర ప్రాంతం నుండి అర్జీలు సమర్పించడానికి వచ్చే బాధితులను దృష్టిలో ఉంచుకొని అర్జీదారుల కొరకు స్వయంగా ఎస్పీ ద్వారా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. స్పందన కార్యక్రమానికి మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయి

పోలీస్ కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ఫిర్యాదు దారుల నుండి SP అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్య యొక్క పూర్వాపరాలను తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులను సత్వరంగా పరిష్కరించ వలసిందిగా తగు ఆదేశాలను జారీ చేసారు. వాటి యొక్క తీవ్రత ఆధారంగా వెంటనే విచారణ జరిపించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టమని ఎస్పీ తెలియజేశారు.

WhatsApp Image 2024 02 12 at 3.08.46 PM

SAKSHITHA NEWS