ప్రజాభివృద్దే మన అజెండా – ఎమ్మెల్యే భూమన
తిరుపతిలో అభివృద్ది పనులకు ఆమోదం – మేయర్ శిరిషా, కమిషనర్ హరిత*
సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ప్రజలకు అవసరమైన రోడ్లు, కాలువలు, మంచినీటి సమస్యలను పరిష్కరించే అంశాలపై చర్చించి పనులు చేపట్టెందు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సాదారణ సమావేశం ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హల్లో మేయర్ శిరిష అధ్యక్షతన, కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి హాజరుకాగా, కమిషనర్ హరిత తీర్మానాలను ప్రవేశపెట్టగా, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో చేపట్టిన 13 మాస్టర్ ప్లాన్ రోడ్లు వలన తిరుపతి అభివృద్ధి ఉహించని రీతిలో జరిగి తిరుపతికి ప్రతిష్టను పెంచడం జరుగుతుందన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామికి స్వయాన చెల్లెలైన తిరుపతి గంగమ్మ జాతరను పెద్ద ఎత్తున జరుపుకుందామని ఆయన పిలుపునివ్వడం జరిగింది. తిరుపతి నగరంలో రూపుదిద్దుకుంట్టున్న రహదారులకు, స్థలాలకు మహనీయులైన వారి పేర్లను పెట్టడం చాలా శుభపరిణామమని ఎమ్మెల్యే భూమన తెలిపారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి నగరంలో డివిజన్లలో అత్యవసరమైన పనులను చేపట్టుటకు కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదించడం జరిగిందన్నారు.
నగరంలో ప్రతి ఒక్క డివిజన్లలోని ప్రధాన సమస్యలను కార్పొరేటర్లు తెలియజేయగా, వాటిని పరిశిలించి ఆమోదించడం జరిగిందన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తమ కౌన్సిల్లోని సభ్యుల సహకారంతో ప్రజాభివృద్ది పనులను చేపడుతున్నామని, మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన అనేక ప్రయోజనాలు వున్నాయని, మరిన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే భూమన వెంటే తామంతా వుంటూ అభివృద్ది వైపు పయనిస్తామన్నారు. తిరుపతి మునిసిపల్ పారిశుధ్య కార్మికులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశాన్ని తదుపరి కౌన్సిల్ సమావేశానికి తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్లకు ముద్రనారాయణ విజ్ఞప్తి చేసారు. స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు మాట్లాడుతూ పాత వెంకటేశ్వర థీయేటర్ వద్దనున్న రైల్వే లైన్ పై పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన ప్రజల్లో వస్తున్న ఆధరణ చూసి ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. కార్పొరేటర్లు లేవనెత్తిన పనుల వివరాల గురించి సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ వివరించగా, కౌన్సిల్ తీర్మానాలను సెక్రటరీ రాధిక తెలియజేసారు.
ఈ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలను మేయర్, కమిషనర్లు తెలియజేసారు. తిరుపతిలో విలీనమైన శెట్టిపల్లి ప్రాంతంలో 2 కోట్లతో సిమెంట్ రోడ్లు, కాలువలు, నీటి సదుపాయం కోసం కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మునిరెడ్డి ఆర్చ్ నుండి ముత్యాలరెడ్డి పల్లి సర్కిల్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి 1 కోటి 86 లక్షలతోనూ, అదేవిధంగా మునిరెడ్డి ఆర్చ్ నుండి మహిళా యూనివర్సిటీ వరకు 80 అడుగుల రోడ్డును అభివృద్ది పరిచేందుకు 1 కోటి 72 లక్షలతో రోడ్లు నిర్మించేందుకు ఆమోదం. తెలుగుగంగా మంచి నీటిని సరఫరా చేయు పంప్ హౌస్ లనందు వున్న మోటర్ పంపులు, సాప్ట్ స్టార్టర్స్, కేబుల్ వైర్లు, అదేవిధంగా మంగళం పంప్ హౌస్, ఎం.డి.పుత్తూరు పంప్ హౌస్ నందు వున్న పంపులు పాడైనందున కొత్తవి ఏర్పాటుకు 1 కోటి 90 లక్షలతో కొత్తవి ఏర్పాటుకు ఆమోదం. రేణిగుంట మెయిన్ రోడ్ పెంతుకొస్తు చర్చి నుండి చేయినేజ్ 900 మీటర్స్ వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 1 కోటి 82 లక్షలకు ఆమోదం. పూలవాణిగుంట మెయిన్ రోడ్ చేయినేజ్ 900 మీటర్స్ నుండి మిగిలిపోయి వున్న వరకు సిసి రోడ్డు నిర్మించుటకు 1 కోటి 64 లక్షలకు ఆమోదం. 6వ వార్డులో సిసి రోడ్లు, కాలువలు నిర్మాణాలకు 1 కోటి 60 లక్షలు, ఎయిర్ బైపాస్ రోడ్ డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ నుండి లక్ష్మిపురం సర్కిల్ మధ్యన డ్యామేజ్ అయిన యుజిడి పైప్ లైన్ మార్చుటకు 1 కోటి 52 లక్షలు, కొర్లగుంట జంక్షన్ నుండి కొత్తపల్లి జంక్షన్ వరకు 40 అడుగుల రోడ్డు విస్తరిస్తూ సిమెంట్ రోడ్డు కొరకు 1 కోటి 35 లక్షలకు ఆమోదం. 3వ వార్డులో సిసి రోడ్లు, కాలువలు నిర్మించుటకు 1 కోటి 30 లక్షలు, 14వ వార్డులో డ్యామేజ్ అయిన కాలువలు, యూజిడి పైప్ లైన్ల స్థానాల్లో కొత్తవి నిర్మించుటకు 1 కోటి 20 లక్షలు, 19వ వార్డులో పోలీస్ గ్రౌండ్ దగ్గర్లో నూతనంగా నిర్మించిన తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయ భవనమున వరకు బిటి రోడ్డు ఏర్పాటుకు ఓక కోటి రూపాయాల కేటాయింపుకు ఆమోదం.
4వ వార్డు సత్యనారాయణ పురం జెడ్.పి.హైస్కూల్ నుండి జీవకోన శివాలయం వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు కోసం 98 లక్షలకు ఆమోదం. తూకివాకం వద్ద గల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నందు పనిచేయుచున్న రెండు మోటర్లు పాతవైనందున కొత్తవి కొనుగొలుకు 96 లక్షలకు ఆమోదం. 19వ వార్డులో సిసి రోడ్లు, కాలువల నిర్మాణాలకు 90 లక్షలు, నగరపాలక సంస్థ అధికారులకు అవసరమైన 20 వాహనములకు సంవత్సరానికి అయ్యే ఖర్చు 89 లక్షలకు ఆమోదం. 43వ వార్డులో యు.డి.ఎస్ లైన్లు మార్చుటకు, నూతన సిసి రోడ్ల నిర్మాణానికి 77 లక్షలు, 50వ వార్డు ఉపాధ్యాయనగర్ మెయిన్ రోడ్డు నిర్మాణానికి 75 లక్షలకు ఆమోదం.
1వార్డు రవీంధ్రనగర్లో సిసి రోడ్ నిర్మాణానికి 75 లక్షలకు ఆమోదం. 33వ వార్డులో కాలువలు, రోడ్లు నిర్మించుటకు 70 లక్షలు, 7,9 వార్డుల్లో రోడ్డు వేయుటకు 66 లక్షలు, 42వ వార్డులో సిసి రోడ్లకు 62 లక్షలు, 26వ వార్డులో పాడైన రోడ్ల స్థానంలో తారు రోడ్ నిర్మించుటకు 60 లక్షలు, 18వ వార్డులో పాడైన కాలువలు నిర్మించేందుకు 60 లక్షలు, 50వ వార్డులో కొత్తగా ఆర్సి మురుగు కాలువలు నిర్మించుటకు 57 లక్షలు, 20వ వార్డులో డ్యామేజి రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మించుటకు 55 లక్షలు, 27వ డివిజన్లో 54 లక్షలతో సిమెంట్ రోడ్లు, 46వ వార్డులో డ్యామేజ్ అయిన రోడ్ల నిర్మాణానికి 50 లక్షలు, 39వ వార్డులో పాత కోనేరు పునరుద్దీకరణకు 50 లక్షలు, 13వ వార్డులో డ్యామేజ్ రోడ్లపై కొత్త రోడ్లు నిర్మించుటకు 50 లక్షలు, 1వ వార్డులో తొలగించిన ఎం.పి.పి స్కూల్ నూతన భవన నిర్మాణానికి 48 లక్షలు, 22వ వార్డులో సిసి రోడ్ల నిర్మాణానికి 45 లక్షలు, 28వ వార్డులో డ్యామేజ్ రోడ్లను నూతనంగా నిర్మించుటకు 45 లక్షలు, 21వ వార్డులో సిమెంట్ రోడ్లు నిర్మించుటకు 45 లక్షలు, 30వ వార్డులో డ్యామేజ్ అయిన కాలువలు నిర్మించుటకు 40 లక్షలు, 45వ వార్డులో సిసి రోడ్లకు 40 లక్షలు, 47వ వార్డులో సిసి రోడ్ల నిర్మాణానికి 40 లక్షలు, 4వ వార్డులో రోడ్ల నిర్మాణాలకు 40 లక్షలు, 29వ వార్డులో అంగన్వాడి భవన నిర్మాణం, కాలువలు నిర్మాణానికి 40 లక్షలు, అదేవిధంగా మరికొన్ని వార్డుల్లో పనులకు కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగింది.తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణకు మునిసిపల్ కార్పొరేషన్ నుండి 25 లక్షలు కేటాయిస్తూ ఆమోదం. నగరంలో వీధి కుక్కలను పట్టి వాటికి శస్త్రచికిత్స చేయించి, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించుటకు ఒక్కొక్క కుక్కకు 1200 రూపాయాలు చెల్లించు పద్దతిపై ఒక సంవత్సరం పాటు పని చేయించుటకు అనిమల్ కేర్ ల్యాండ్ వారికి అనుమతిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగిందని మేయర్ శిరిష, కమిషనర్ హరిత తెలిపారు.