–చిట్యాల లో నిరసన తెలిపిన బిజెపి శ్రేణులు
— పలువురు నాయకుల ముందస్తు అరెస్ట్
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లో అక్రమంగా అ ప్రజాస్వామికంగా అర్థరాత్రి ఇంటి పై దాడి చేసి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేసి బండి సంజయ్ ని గాయపరిచి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మండలంలో బిజెపి శ్రేణులు నిరసన తెలిపారు. బిజెపి చిట్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళుతున్న బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్, బిజెపి పట్టణ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను,నాయకులు చికిలం మెట్ల అశోక్, పల్లపు బుద్ధుడు, కన్నెబోయిన మహాలింగం యాదవ్, మాస శ్రీనివాస్, పల్లె వెంకన్న గౌడ్, జిట్ట కృష్ణ ,కోళ్ల స్వామి, పాల రవివర్మలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్, బిజెపి పట్టణ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయి ప్రజల విశ్వాసం కోల్పోయి నిరంతరం నిత్యం ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతున్న బిజెపి నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతుందని అన్నారు
బిఆర్ఎస్ ప్రభుత్వ అరాచక నియంతృత్వ కుటుంబ పాలన అంతమొందించే వరకు బిజెపి కార్యకర్తలు నాయకులు నిద్రపోరని రామరాజ్యం పేదలరాజ్యం వచ్చేంతవరకు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు పోరాడుతుందని హెచ్చరించారు. పెద్దకాపర్తి గ్రామంలో బిజెపి రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ అధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ కి నిరసనగా
కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్దుడు, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు గుంటోజు నాగాచారి , బూత్ అధ్యక్షుడు తెల్సూరి నరసింహ , బూత్ ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నరసింహ సీనియర్ నాయకులు పొట్లపల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.