SAKSHITHA NEWS

farmer రైతు బాగుంటేనే దేశ ప్రగతి

కాంగ్రెస్ పాలనలో పెరిగిన ఆత్మ హత్యలు

రైతు భోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

farmer రైతు బాగుంటేనే దేశం ప్రగతి పధం లో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్ళీ రాష్ట్రంలో ఆత్మ హత్యలు పెరిగాయని బి.ఆర్.ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధిర అసెంబీ నియోజకవర్గం లోని చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని నామ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రైతు భోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న నామ ఆవేదనకు చెందారు వెంటనే రైతు తండ్రి పెద్ద వీరయ్య తో చరవాణి లో మాట్లాడి, ఆత్మహత్య కు గల కారణాలు అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ 276, 277లో గల బోజడ్ల ప్రభాకర్, వీరభద్రయ్య భూమిలో దగ్గర్లో గల చెరువు నుండి మొరం తోలించుకుంటే కొందరు వ్యక్తులు కక్ష పూరితంగా వ్యవహరించి రైతు పొలం లో జేసీబీ లో పొక్లైన్తో తో మట్టిని చెల్లా చెదురు చేయడం దారుణమని, రైతు ఎన్ని సార్లు అధికారాలకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోవటం శోచనీయమని నామ ఆవేదన వ్యక్తం చేసారు. రైతు ప్రభాకర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన నామ వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయడం తో పాటు గా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

రైతు భోజడ్ల ప్రభాకర్ న్యాయం చేయమని వేడుకున్న అతని విజ్ఞప్తి పట్ల కనుకరించకుండా రైతును ఇబ్బంది పెట్టి ఆత్మహత్య కు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకునేలా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిటం తో వారు ఎంతటి వారు అయినా వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నామ డిమాండ్ చేసారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో లో రైతు సంక్షేమానికి కెసిఆర్ పెద్ద పీట వేశారని నామ ఈ సందర్భంగా గుర్తు చేసారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

farmer

SAKSHITHA NEWS