SAKSHITHA NEWS

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం

విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు.

డిజెఎఫ్ జాతీయ మహాసభ కు ముఖ్య అతిథి గా విచ్చే సిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించా రు.జర్నలిస్టుల పై ప్రభుత్వా లు సానుకూలంగా ఉండాల న్నారు.

వారికి విద్య వైద్యం తో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నా రు.కార్పోరేట్ విద్యాల యాలలో జర్నలిస్టులకు 50 శాతం రాయితీ ఇప్పటికే అమలు లో ఉన్నదని కానీ అది కూడా సరిగా అమలు కావటం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని వాటి ప్రామాణికతలలో కూడా మరింత వెసులుబాటు కలిగేలా ప్రయత్నం చేయాల న్నారు.

అలాగే ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు.ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకు వస్తే సంబం ధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని హామీఇచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలం గా ఉందని త్వరిత గతిన జర్నలిస్టులకు మంచి జరుగుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు…

WhatsApp Image 2024 02 08 at 4.00.36 PM

SAKSHITHA NEWS