SAKSHITHA NEWS

డాక్టర్లు, అగ్నిమాపక భద్రత లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు సీజ్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం.

సాక్షిత న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : అర్హత గల డాక్టర్లు లేకుండా అగ్నిమాపక భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంటనే ఆ ఆసుపత్రులను సీజ్ చేస్తామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించారు.

జిల్లా కేంద్రంలో ఈ రోజు ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నాలుగు ఆసుపత్రులు కొత్త బస్టాండ్ పక్కన ఉన్న శ్రీ చెస్ట్ హాస్పిటల్, నక్షత్ర హాస్పిటల్, శ్రీ సూర్య హాస్పిటల్ మరియు సాయి కీర్తన ప్రైవేటు హాస్పటల్ లను వెంటనే సీజ్ చేసారు.

ఈ ఆస్పత్రులలో డాక్టర్లు లేరని ప్రభుత్వ డాక్టర్లు కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారని, ప్రభుత్వ డాక్టర్ల పేరు మీద నమోదైన ఆసుపత్రుల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్లు విధిగా వారు నిర్వహించే ప్రైవేటు హాస్పిటల్ లు, పనిచేసే వేళలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి తెలియచేయాలని తెలిపినారు.

ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపినారు.

చట్టపర నిబంధనలు ఉల్లoగించిన వారిపై ముందస్తు నోటీసు ఇవ్వకుండానే సీజ్ చేస్తామని హెచ్చరించినారు.

రెండు రోజులలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలోని అగ్నిమాపక భద్రతా సర్టిఫికెట్, బయో మెడికల్, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లు సమర్పించాలని , గతంలో కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేసినప్పటికిని స్పందన కొరవడిందని, ఆశించిన మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు స్పందించలేదని, చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించినారు.

ప్రైవేటు ఆసుపత్రులు సీజ్:

SAKSHITHA NEWS