ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం తలంబ్రాలు తయారీ

Spread the love

సాక్షిత కడప జిల్లా ఒంటిమిట్ట

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో గురువారం తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కలిసి డెప్యూటీ ఈఓ నటేష్ బాబుకు అందజేశారు. అక్కడినుండి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 350 మంది శ్రీవారి సేవకులు 1.75 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ దేవరాజులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page