గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం..

గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం..

SAKSHITHA NEWS

గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం..

  • కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కంటోన్మెంట్‌ బోర్డుల పరిధిలోని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్‌ న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో మంగళవారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎస్‌ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రికి తెలియజేశారు. బ్రిటిష్‌ పాలన నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులను రద్దు చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి గిరిధర్‌ ఈ సందర్భంగా తెలిపారు..

గ్రేటర్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతాల విలీనానికి సిద్ధం..

SAKSHITHA NEWS