SAKSHITHA NEWS

సాక్షిత విశాఖపట్నం:
.175 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ.
మోడీ తొత్తులతో యుద్ధం..ప్రజాశాంతి పార్టీ సిద్ధం. అదే మన నినాదం.
రాబోయే ఎన్నికల్లో
ప్రజాశాంతి పార్టీ, కే ఏ పాల్ నాయకత్వంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రజాశాంతి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జిలుకర రవికుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
మన దేశ మరియు రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైన ఘట్టంలో మేము నిలబడి ఉన్నాము,”చాలా కాలంగా మన సమాజాన్ని పీడిస్తున్న పేదరికం,
పక్షపాత రాజకీయాల నుండి కొత్త సమాజాన్ని ఏర్పాటు చేయడం కొరకు ప్రజాశాంతి పార్టీ కృషి చేస్తుందని,

నిజమైన మార్పు కోసం ప్రజాశాంతి పార్టీని గెలిపించాల్సిందిగా జిలుకర రవికుమార్ అభ్యర్థించారు.ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైందని,మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు దారి చూపేదై ఉండాలని, ఆలోచించి ఓటు వేయాలని జిలుకర రవికుమార్ అన్నారు.ప్రజాశాంతి పార్టీ మున్ముందు ఎన్నికల సమరానికి సిద్ధమవుతుందని..మోడీ తొత్తులతో యుద్ధం..ప్రజాశాంతి పార్టీ సిద్ధం. అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. ప్రజాసేవ చేయాలనే వాళ్ళు ప్రజాశాంతి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు.

ప్రజాశాంతి పార్టీలోకి ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్.

ప్రముఖ సినినటుడు మరియు మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రిగా పనిచేసిన బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ లాంటి సీనియర్ రాజకీయవేత్తలు ప్రజాశాంతి పార్టీకి అవసరమని, వరంగల్ ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారని, ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని కేఏ పాల్ అన్నారు. దేశ మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం కేఏ పాల్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాబు మోహన్ తెలియజేశారు.

WhatsApp Image 2024 03 05 at 1.53.21 PM

SAKSHITHA NEWS