అమరజీవి పోరాట స్ఫూర్తిని..నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి..
అమరజీవి పొట్టి శ్రీరాములు కి 71వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన..
-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నరసరావుపేట పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా అమరజీవి విగ్రహానికి నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు…ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు.
మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ వంటి ఆశయాల కోసం అనితర కృషి చేశారని తెలిపారు. సర్వసాధారణంగా ప్రారంభమైన అమరజీవి ఆమరణ దీక్ష ప్రజల్లో తీవ్రస్థాయిలో అలజడి రేపిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన కోసం చివరి వరకు పోరాడి కన్నుమూయటంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని హింసాత్మక ఘటనలకు పాల్పడడంతో, అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారని తెలిపారు. అమరజీవి పోరాట స్ఫూర్తిని నేటి యువత కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూచించారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు..